Dhruv Jurel Catch Video: నేను క్యాచ్ పట్టానా అంటూ షాకయిన వికెట్ కీపర్, స్టన్నింగ్ క్యాచ్ చూసి ఆశ్చర్యపోయిన క్రికెట్ ప్రేమికులు, మీరు కూడా వీడియో చూసేయండి

బ్యాట్స్మన్ ముందుకెళ్లడంతో స్టంప్ ఔట్ చేయాలన్న మూమెంట్‌లో కీపర్ ఉన్నాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా ద్రువ్ జురేల్ తన గ్లోవ్స్‌ని పైకి లేపడంతో, బంతి చేతికి చిక్కింది. ఈ స్టన్నింగ్ క్యాచ్ చూసి మైదానంలో ఉన్న ఆటగాళ్ళు మాత్రమే కాదూ.. స్వయంగా కీపర్ కూడా ఆశ్చర్యపోయాడు.

Dhruv Jurel Catch Video (Photo-Video Grab/BCCI)

రంజీ ట్రోఫీ 2022లో అధ్బుతమైన సన్నివేశం చోటు చేసుకుంది. కర్నాటక, ఉత్తర్‌ ప్రదేశ్‌ మధ్య మ్యాచ్‌లో భాగంగా 98 పరుగుల ఆధిక్యంతో కర్ణాటక రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 33 పరుగుల వద్ద రవికుమార్‌ సమ్రాట్‌ రూపంలో ఈ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 12వ ఓవర్‌లో మయాంక్‌ అగర్వాల్‌ అనూహ్య రీతిలో ఔటయ్యాడు. సౌరబ్‌ కుమార్‌ బౌలింగ్‌లో అతను ముందుకొచ్చి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే, బంతి స్వింగ్ అవ్వడంతో బ్యాట్ ఎడ్జ్‌ను తాకింది. దాంతో అది గాల్లోకి లేచి, కీపర్‌ ద్రువ్‌ జురేల్‌ దిశగా దూసుకెళ్లింది. బ్యాట్స్మన్ ముందుకెళ్లడంతో స్టంప్ ఔట్ చేయాలన్న మూమెంట్‌లో కీపర్ ఉన్నాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా ద్రువ్ జురేల్ తన గ్లోవ్స్‌ని పైకి లేపడంతో, బంతి చేతికి చిక్కింది. ఈ స్టన్నింగ్ క్యాచ్ చూసి మైదానంలో ఉన్న ఆటగాళ్ళు మాత్రమే కాదూ.. స్వయంగా కీపర్ కూడా ఆశ్చర్యపోయాడు. 'ఏంటీ.. నేను క్యాచ్ పట్టానా?' అంటూ కొన్ని క్షణాలు అలాగే నిల్చుండిపోయాడు. ఓవైపు వికెట్ పడిందని తోటి ఆటగాళ్ళు సెలెబ్రేట్ చేసుకుంటే, కీపర్ మాత్రం ఇంకా షాక్‌లోనే ఉండిపోయాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now