Yuvraj Singh Six Sixes Video: యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్ల వీడియో మళ్లీ మీకోసం, నేటితో ఈ విధ్వంసానికి 16 ఏళ్లు పూర్తి, ఆరు సిక్సర్లు బాదడాన్ని ఇసుకతో బొమ్మగా వేసిన అభిమాని
ఇంగ్లండ్ బౌలర్ స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) బౌలింగ్‌లో ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు కొట్టాడు.
దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన పొట్టి ప్రపంచ కప్(T20 World Cup 2007)లో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు బాది విధ్వంసం రేపిన సంగతి విదితమే. ఇంగ్లండ్ బౌలర్ స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) బౌలింగ్‌లో ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు కొట్టాడు. ఈ అద్భుత ఫీట్‌కు నేటితో 16 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా క్రిస్టీ వలియవీట్టిల్ అనే ఓ అభిమాని యూవీ ఆరు సిక్సర్లు బాదడాన్ని ఇసుకతో బొమ్మగా వేశాడు.
ఈ వీడియోను యువరాజ్ సింగ్ తన ఎక్స్ ఖాతాలో పెట్టాడు. ఇంత అద్భుతమైన సాండ్ ఆర్ట్ వేసినందుకు క్రిస్టీ వలియవీట్టిల్ నీకు థాంక్యూ. దీన్ని నువ్వు నా పుట్టిన రోజు కోసమే తయారు చేశావని తెలుసు. ఈ ఆర్ట్ వీడియోను అందరితో పంచుకునేందుకు ఇదే సరైన సమయం అని అనిపించింది అని యూవీ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇదే ఆ వీడియో
Here's Yuvraj Singh Six Sixes Video
Here's Sand Art Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)