Nikhat Zareen: నిన్ను చూసి దేశం గర్వపడుతోంది నిఖత్‌ జరీన్, ప్రపంచ చాంపియన్‌కు అభినందనలు తెలిపిన రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్

2022 IBA Women's World Boxing Championships, boxing, IBA Women's World Boxing Championships, Nikhat Zareen, Nikhat Zareen Achievements, Women's World Boxing Championships, World Boxing Championship, ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌, నిఖత్‌ జరీన్‌,వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌, ప్రధాని మోదీ, Ramnath Kovind

Ram-Nath-Kovind

ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్ బంగారు ప‌త‌కం సాధించ‌డం ప‌ట్ల రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌రీన్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆమెను చూసి ఈ దేశం గ‌ర్వ‌ప‌డుతుంద‌ని రామ్‌నాథ్ పేర్కొన్నారు. జ‌రీన్ విజ‌యం నేటి యువ‌త‌కు స్ఫూర్తిదాయ‌కంగా ఉంటుంద‌ని విశ్వ‌సిస్తున్నాన‌ని చెప్పారు. ముఖ్యంగా అమ్మాయిలు వారి క‌ల‌ల‌ను నేరవేర్చుకునేందుకు జ‌రీన్ విజ‌యం ప్రేర‌ణ క‌లిగిస్తుంద‌ని న‌మ్ముతున్నాన‌ని ఆయ‌న తెలిపారు. నిఖ‌త్ జ‌రీన్ ఈ దేశానికి మ‌రిన్ని అవార్డులు తీసుకురావాల‌ని కోరుకుంటున్నాన‌ని రాష్ట్ర‌ప‌తి పేర్కొన్నారు.ప్రతిష్ఠాత్మక మహిళల వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ (Nikhat Zareen) విజేతగా నిలిచింది. గురువారం 52కేజీ ఫ్లయ్‌వెయిట్‌ విభాగంలో (World Boxing Championships 2022) జరిగిన ఫైనల్లో తను 5-0 తేడాతో జిట్‌పాంగ్‌ జుటామస్‌ (థాయ్‌లాండ్‌)ను చిత్తుగా ఓడించి స్వర్ణం అందుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)