Nikhat Zareen: నిఖత్ జరీన్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, తెలంగాణ బిడ్డ విశ్వ విజేతగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి హర్షం
చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతిష్టాత్మక 'ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్' పోటీల్లో నిజామాబాద్ కు చెందిన @Nikhat_Zareen విశ్వ విజేతగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కాగా ప్రతిష్ఠాత్మక మహిళల వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) విజేతగా నిలిచింది. గురువారం 52కేజీ ఫ్లయ్‌వెయిట్ విభాగంలో (World Boxing Championships 2022) జరిగిన ఫైనల్లో తను 5-0 తేడాతో జిట్‌పాంగ్ జుటామస్ (థాయ్‌లాండ్)ను చిత్తుగా ఓడించి స్వర్ణం అందుకుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)