Sania Mirza: సానియా ఫేర్‌వెల్ మ్యాచ్.. ముఖ్య అతిధిగా కేటీఆర్.. వీడియో వైరల్
భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫేర్‌వెల్ మ్యాచ్‌తో సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఈ చివరి మ్యాచ్‌ను చూసేందుకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, సినీ నటుడు దుల్కర్ సల్మాన్, మాజీ క్రికెటర్లు యువరాజ్‌సింగ్, అజారుద్దీన్ ఎల్బీ స్టేడియంకు వచ్చి మ్యాచ్ తిలకించారు.
Hyderabad, March 6: భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా (Sania Mirza) ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫేర్‌వెల్ (Farewell) మ్యాచ్‌తో సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. తన చివరి మ్యాచ్ సింగిల్స్ లో సానియా vs రోహన్ బోపన్న .. డబుల్స్‌లో సానియా, బోపన్న జోడీ vs ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ తలపడ్డారు. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం సానియా ఒక్కసారిగా భావోద్వేగానికిలోనై కంటతడి పెట్టుకుంది. ఈ చివరి మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులతో పాటు తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR), సినీ నటుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), మాజీ క్రికెటర్లు యువరాజ్‌సింగ్(Yuvaraj singh), అజారుద్దీన్, ప్రముఖ భారతీయ రాపర్, గీత రచయిత MC స్టాన్ తదితరులు ఎల్బీ స్టేడియంకు వచ్చి మ్యాచ్ తిలకించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)