Brabourne, March 05: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ సాధించింది. ముంబైలోని బ్రబౌర్నే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 రన్స్ చేసింది. 224 లక్ష్య ఛేదనలో ఆ జట్టు ఆది నుంచి తడబడింది. ఢిల్లీ బౌలర్ తారా నోరిస్ (Tara Norris ) ఐదు వికెట్లు తీసి ఆర్సీబీని దెబ్బకొట్టింది. కీలకమైన హీథర్ నైట్ (34), ఎలిసే పెర్రీ (31) , దిశా కసత్(9), కనికా అహుజా (0), రీచా ఘోష్ (2)లను ఔట్ చేసింది. నైట్, మేఘనా షట్ (30) చివర్లో బ్యాటు ఝులిపించడంతో ఆర్సీబీ మాత్రం స్కోర్ చేయగలిగింది. వీళ్లిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 54 రన్స్ జోడించారు. తారా నోరిస్ నాలుగు ఓవర్లలో 29 రన్స్ మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసింది. డబ్ల్యూపీఎల్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి అసోసియేట్ ప్లేయర్ నోరిస్ రికార్డు సృష్టించింది. ఢిల్లీ బౌలర్లలో అలిసే క్యాప్సే రెండు, శిఖా పాండే ఒక వికెట్ తీశారు.
The @DelhiCapitals complete a 60-run victory over #RCB and are off the mark in the #TATAWPL 👏👏
Scorecard ▶️ https://t.co/593BI7xKRy#TATAWPL | #RCBvDC pic.twitter.com/AUd4no3tA3
— Women's Premier League (WPL) (@wplt20) March 5, 2023
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఓపెనర్లు మేగ్ లానింగ్ (72), షఫాలీ వర్మ (84) వీర బాదుడు బాదారు. జెమీమా రోడ్రిగ్స్ (22), మరిజానే కాప్ (39) ఫోర్లు, సిక్సర్లతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీళ్లు మూడో వికెట్‌కు 60 రన్స్ జోడించారు. భారీ టార్గెట్ చేధనలో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన (35)భారీ షాట్లతో అలరించింది. అయితే.. అలిసే క్యాప్సే ఓవర్‌లో షాట్‌కు ప్రయత్నించి (35) ఔట్ అయింది 56 పరుగుల వద్ద ఆమె రెండో వికెట్‌గా వెనుదిరిగింది. 41 పరుగుల వద్ద ఓపెనర్ సోఫీ డెవిన్ (14) ఔట్ అయింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు ఓపెనర్ షఫాలీ వర్మ (Shafali Verma), మేగ్ లానింగ్ శుభారంభం ఇచ్చారు. తొలి బంతి నుంచే వీళ్లిద్దరూ రాయల్ ఛాలెంజర్స బౌలర్లపై విరుచుకు పడ్డారు. షఫాలీ 32 బంతుల్లో ఫిఫ్టీ బాదింది. ఈ లీగ్‌లో రెండో అర్ధ శతకం నమోదు చేసింది. ఆ తర్వాత లానింగ్ కూడా ఫిఫ్టీ కొట్టింది. పోటాపోటీగా బౌండరీలు బాదిన వీళ్లిద్దరూ తొలి వికెట్‌కు 163 పరుగులు జోడించారు. షఫాలీ 45 బంతుల్లోనే 84 రన్స్ చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. బ్యాటింగ్‌లో చెలరేగిన షఫాలీ ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకుంది. రెండు సూపర్ క్యాచ్‌లు పట్టింది.