Tokyo Olympics: స్వర్ణ పతకం గెలిస్తే రూ. 6 కోట్లు, రజతం కొడితే రూ. 4 కోట్లు, కాంస్య పతకధారికి రూ. 2 కోట్లు, బంపరాఫర్ ప్రకటించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

Uttar Pradesh CM Yogi Adityanath | File Image | (Photo Credits: PTI)

ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న తమ రాష్ట్ర అథ్లెట్లకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ భారీ నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు. టోక్యో క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన ప్లేయర్‌కు ఏకంగా రూ. 6 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. రజతం కొడితే రూ. 4 కోట్లు, కాంస్య పతకధారికి రూ. 2 కోట్లు నజరానా అందిస్తామన్నారు. టీమ్‌ ఈవెంట్లలో పసిడి గెలిచిన ఆటగాడికి రూ. 3 కోట్లు, రజతానికి రూ. 2 కోట్లు, కాంస్యానికి రూ. కోటి చొప్పున ఇస్తామన్నారు. ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత బృందంలో పదిమంది యూపీ అథ్లెట్లు ఉన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు