AP Coronavirus: ఏపీలో 10 వేలు దాటిన యాక్టివ్ కేసులు, తాజాగా 1,730 మందికి కరోనా పాజిటివ్, ఐదుగురు మృతితో 7,239కు చేరుకున్న మరణాల సంఖ్య
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 31,072 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,730 మందికి పాజిటివ్‌గా నిర్థారణ (AP Covid Update) అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,07,676 మందికి కరోనా వైరస్ సోకింది. గడచిన 24 గంటల్లో 842 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 8,90137 డిశ్చార్జ్ అయ్యారు.
గత 24 గంటల్లో కరోనా వైరస్ బారినపడి చిత్తూరులో ముగ్గురు.. నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతి చెందగా, ఇప్పటివరకు 7,239 (Covid Deaths) మరణించారు. ఏపీలో ప్రస్తుతం 10,300 యాక్టివ్ కేసులు (Covid Active covid cases) ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు 1,52,08,436 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)