Sonu Sood Meets CM Chandrababu: ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన సోనూ సూద్, సీఎం చంద్రబాబుతో భేటీ

ప్రముఖ సినీ నటుడు, ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్‌ ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను అందించారు.

Sonu Sood Meets CM Chandrababu

ప్రముఖ సినీ నటుడు, ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్‌ ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను అందించారు. సచివాలయంలో మర్యాదపూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.

వీడియో ఇదిగో, విజయవాడలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని వాలంటీర్ హంగామా, వాలంటీర్ వ్యవస్థను పునరుద్దరించాలని డిమాండ్

ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని... ఈ ఆశయంలో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నటుడు సోనూ సూద్ కు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు. కాగా, నటుడు సోనూ సూద్ ఏపీ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చిన అంబులెన్స్‌లు రెగ్యులర్ గా కనిపించే అంబులెన్స్‌ల తరహాలో కాకుండా, ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

Sonu Sood Meets CM Chandrababu

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement