Andhra Pradesh Horror: నంద్యాల ఘటన మరచిపోకముందే మరో దారుణం, తిరుపతిలో 8 ఏళ్ళ బాలికపై అత్యాచారం, అనంతరం హత్య చేసిన కామాంధుడు

నంద్యాల జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య ఘటన మర్చిపోకముందే తిరుపతిలో మరో చోట ఘోరం జరిగింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం నెలబల్లిలో ఎనిమిదేళ్ల బాలికపై బీహార్ యువకుడు అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం బాలిక మృతదేహాన్ని నేషనల్ హైవే పక్కన రైస్ మిల్లు సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు

8-year-old girl Rape and murdered in Tirupati

ఏపీలో నంద్యాల జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య ఘటన మర్చిపోకముందే తిరుపతిలో మరో చోట ఘోరం జరిగింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం నెలబల్లిలో ఎనిమిదేళ్ల బాలికపై బీహార్ యువకుడు అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం బాలిక మృతదేహాన్ని నేషనల్ హైవే పక్కన రైస్ మిల్లు సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు. బిస్కెట్లు ఇచ్చి బాలికను యువకుడు చెట్ల పొదల్లోకి తీసి అఘాయిత్యానికి పాల్పడ్డారు.  నంద్యాల బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు, ఆ ముగ్గురు సెల్‌ఫోన్లో వీడియోలు చూసి పార్కులో ఆడుకుంటున్న బాలికపై..

అనంతరం బాలికను చంపేసి అక్కడి నుంచి పరారయ్యారు. బాలిక మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. రైస్ మిల్లులో పని చేసే కార్మికుడు కూతురి మృతదేహంగా గుర్తించారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు స్థానిక సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. గురువారం నిందితుడి జైల్లో ప్రవేశ పెట్టే అవకాశం కనిపిస్తోంది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement