Nara Lokesh on Talliki Vandanam Scheme: వీడియో ఇదిగో, ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తాం, అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో తల్లికి వందనం పథకానికి విధివిధానాలను రూపొందిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ‘తల్లికి వందనం’ ఇస్తామని స్పష్టం చేశారు.

Nara Lokesh (Photo-Video Grab)

ఏపీలో తల్లికి వందనం పథకానికి విధివిధానాలను రూపొందిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ‘తల్లికి వందనం’ ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు బడుల విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. గత ప్రభుత్వ వైఫల్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో 72వేల మంది విద్యార్థులు తగ్గారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని మంచి విధానాలపై అధ్యయనం చేస్తామని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలను అమలు చేస్తామన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు బిల్లుపై ఏపీ అసెంబ్లీలో చర్చ, సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement