Dwarampudi Chandrasekhar Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు, ఆయన అనుచరులతో సహా 24 మందిపై కేసు

కాకినాడలో వైసీపీ మాజీ కార్పొరేటర్ నిర్మించిన బిల్డింగు అక్రమమంటూ అధికారులు కూల్చేస్తుండగా అడ్డుపడ్డ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మున్సిపల్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరో 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Dwarampudi Chandrasekhar Reddy (photo-Video Grab)

వైసీపీ నేత, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో పాటు మరో 24 మందిపైనా కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం కేసు నమోదు చేశారు. ఈ నెల 2న కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని రాజ్యలక్ష్మినగర్‌లో వైసీపీ నాయకుడు సూరిబాబుకు చెందిన అక్రమ కట్టడం కూల్చివేత ఘటనలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని అధికారులు ఫిర్యాదు చేశారు.  వీడియో ఇదిగో, ప్రభుత్వ స్కూల్ ఉపాధ్యాయుడిపై చెప్పరాని బూతులతో రెచ్చిపోయిన టీడీపీ నేత, స్కూల్లో రేషన్ బియ్యం బస్తాలు దించొద్దని చెప్పడమే కారణం

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరులతో వచ్చి గొడవకు దిగారని, రెచ్చగొట్టేలా వ్యవహరించారని పేర్కొన్నారు. ద్వారంపూడి ప్రోద్బలంతో వైసీపీ కార్యకర్తలు మున్సిపల్ అధికారులు, సిబ్బందిపై దాడులకు దిగారని ఫిర్యాదు చేశారు. ఏ1గా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఏ2గా బళ్ల సూరిబాబు, మరో 24 మందిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నాగేశ్వర్ నాయక్ తెలిపారు.

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement