CM Chandrababu Amaravati Visit: వీడియో ఇదిగో, అమరావతి శంకుస్థాపన ఏరియాలో నేలపై మోకరిల్లి నమస్కరించిన సీఎం చంద్రబాబు

రాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. అక్కడ పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని సీఎం తెలుసుకున్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరారు. తొలుత ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు

CM Chandrababu Amaravati Visit

రాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. అక్కడ పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని సీఎం తెలుసుకున్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరారు. తొలుత ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెం వెళ్లారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రదేశంలో మోకాళ్లపై కూర్చొని నమస్కరించారు. గతంలో సేకరించిన మట్టికి అక్కడ పూజలు చేశారు. శభాష్ ఏపీ పోలీస్, సూర్యలంక బీచ్‌లో భారీ అలలకు మునిగిపోతున్న 6 మంది యాత్రికులను కాపాడిన వీడియో ఇదిగో..

శంకుస్థాపన ప్రాంతం పరిశీలిన అనంతరం సీడ్‌ యాక్సెస్‌ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను చంద్రబాబు పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement