Navratri 2023: వీడియో ఇదిగో, కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్, అంతరాలయంలో ప్రత్యేక పూజలు
అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీదేవిని దర్శించుకున్న సీఎంకు ఆలయ వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్నిసీఎంకు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అందజేశారు.
తొలుత ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్‌కు పూర్ణకుంభంతో వేద పండితులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయ చిన్న రాజగోపురం వద్ద సీఎం జగన్‌కు అర్చకులు పరివేష్టం చుట్టారు. శుక్రవారం అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు అనుగ్రహించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)