Kakinada Shocker: వీడియో ఇదిగో, కాకినాడలో నడిరోడ్డుపై ఇన్స్‌స్పెక్టర్‌ని కత్తితో నరికిన వ్యాపారి, తెగిపడిన పోలీస్ చేతి వేళ్లు, పరిస్థితి విషమం
కాకినాడలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌స్పెక్టర్‌పై కొబ్బరి బొండాల వ్యాపారి దుర్గాప్రసాద్ కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి తెగబడ్డాడు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌పైనా దాడికి యత్నించాడు.
కాకినాడలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌స్పెక్టర్‌పై కొబ్బరి బొండాల వ్యాపారి దుర్గాప్రసాద్ కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి తెగబడ్డాడు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌పైనా దాడికి యత్నించాడు. వాహనాల తనిఖీ సందర్భంగా దుర్గారావుకు చెందిన కొబ్బరి బొండాల వాహనం పేరున పలు చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్టు తొలుత ఇన్స్‌పెక్టర్ గుర్తించారు. డబ్బు కట్టాలని దుర్గారావును ఆదేశించారు. దీంతో..ఇద్దరి మధ్య వివాదం మొదలైందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో ఎంవీ ఇన్‌స్పెక్టర్ చిన్నారావు శరీరమంతా కత్తిగాయాలయ్యాయి. చేతి వేళ్లు తెగిపడ్డాయి. ఇక కొబ్బరి బొండాల కత్తితో ..చిన్నారావుపై నిందితుడు దుర్గాప్రసాద్ దాడి చేస్తున్న ఘటనకు సంబంధించి వీడియో స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ చిన్నారావు ప్రస్తుతం కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి క్రిటికల్ ఉన్నట్లు సమాచారం.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)