Andhra Pradesh Elections 2024: కావలిలో టీడీపీకి భారీ షాక్, పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి
నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కి టికెట్ కేటాయించకపోవడంతో టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు.
టీడీపీ తుది జాబితా ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడేలా చేసింది. తాజాగా నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కి టికెట్ కేటాయించకపోవడంతో టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధిష్టానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. పార్టీ కోసం కష్టపడి ఇన్నేళ్లుగా పని చేసిన వారిని పక్కన పెట్టడంపై నేతలు తీవ్ర అసహానం వ్యక్తం చేస్తున్నారు. చీపురుపల్లిలో టీడీపీకి షాక్, పార్టీకి రాజీనామా చేసిన విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)