Congress Chalo Secretariat Protest: షర్మిల అరెస్ట్, వెంటనే విడుదల, ఒక్కహామీని నెరవేర్చని జగన్ వైఎస్‌ఆర్ వారసుడినని ఎలా ప్రకటించుకుంటారని మండిపాటు
ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది
మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. షర్మిలతో పాటు కార్యకర్తలు, నాయకులను దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సీఎం జగన్ మడత పెట్టేశారని షర్మిల ఆరోపించారు. 151 సెక్షన్ కింద సంతకాలు తీసుకొని మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఆమెను పంపించేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిన జగన్.. వైఎస్‌ఆర్ వారసుడినని ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖలలోని ఖాళీలను భర్తీ చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే తిరిగి సొంతగూటికి చేరుకోవడంపై శుక్రవారం స్పందిస్తానని చెప్పారు. 23 వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి 6 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు, మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారంటూ షర్మిల నిరసన
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)