Andhra Pradesh: విజయనగరంలో ఘోర అగ్ని ప్రమాదం, విశాల్ మార్ట్‌లో చెలరేగిన మంటలు, మార్ట్ మూసివేసి ఉండటంతో తప్పిన పెను ప్రమాదం
మూడో అంతస్తులో చెలరేగి ఐదో అంతస్తు వరకు మంటలు వ్యాప్తి చెందాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్ని ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.
విజయనగరంలోని విశాల్ మార్ట్‌లో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మూడో అంతస్తులో చెలరేగి ఐదో అంతస్తు వరకు మంటలు వ్యాప్తి చెందాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్ని ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.మార్ట్‌లో బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా ఉండటంతో మంటల భారీగా వ్యాపించాయి. ఇక, అగ్ని ప్రమాదం కారణంగా కలెక్టరేట్ రోడ్‌లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మార్ట్ మూసివేసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)