Vallabhaneni Vamsi Mohan: తాము వెళ్లి చర్చిస్తే లోకేశ్ మాట్లాడగలరా, లోకేశ్ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన వల్లభనేని వంశీ
దొంగల్లా కాకుండా నేరుగా తమ వద్దకు వచ్చి మాట్లాడాలని లోకేశ్ సవాల్ చేస్తున్నారని మీడియా ప్రస్తావించగా... తాము వెళ్లి చర్చిస్తే లోకేశ్ మాట్లాడగలరా? అంటూ ఆయన స్పందించారు.
టెన్త్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లోకి వైసీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని ఎంట్రీ ఇచ్చిన వ్యవహారం ఆసక్తి రేపింది. వైసీపీ ఫేక్ పార్టీ కాబట్టే... ఆ పార్టీ నేతలు ఫేక్ ఐడీలతో జూమ్ మీటింగ్‌లోకి వచ్చారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే నేరుగా వచ్చి తనతో మాట్లాడాలని కూడా లోకేశ్ వారికి సవాల్ విసిరారు. ఈ వ్యవహారంపై తనను కలిసిన మీడియా ప్రతినిధుల వద్ద వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దొంగల్లా కాకుండా నేరుగా తమ వద్దకు వచ్చి మాట్లాడాలని లోకేశ్ సవాల్ చేస్తున్నారని మీడియా ప్రస్తావించగా... తాము వెళ్లి చర్చిస్తే లోకేశ్ మాట్లాడగలరా? అంటూ ఆయన స్పందించారు. అయినా తామేమీ జూమ్ మీటింగ్‌లోకి దొంగల్లా ప్రవేశించలేదని, చాలా మందిని ఆహ్వానించిన తర్వాతే మీటింగ్ పెట్టారు కదా... అందులో గత ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ఏమిటో చెప్పేందుకే ప్రవేశించామని వంశీ అన్నారు. అయినా టెన్త్ విద్యార్థులకు ధైర్యం చెప్పాల్సిన లోకేశ్.. అందుకు విరుద్ధంగా తమ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారని వంశీ చెప్పారు. జూమ్ మీటింగ్‌లో తాము మాట్లాడిన దానిని చూపించడానికి లోకేశ్‌కు భయమేంటీ? అని కూడా వంశీ ప్రశ్నించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)