Andhra Pradesh Cylinder Explosion: వీడియో ఇదిగో, నంద్యాలలో ఇంట్లో ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్, ఇద్దరు మృతి, మరో తొమ్మిది మందికి గాయాలు
ఏపీలోని నంద్యాల పరిధి చాపిరేవులలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. 9 మందికి గాయాలయ్యాయి. చాపిరేవులకు చెందిన వెంకటమ్మ (70) ఇంటికి బేతంచర్ల మండలం పెండేకల్లు గ్రామానికి చెందిన సుబ్బమ్మ, రాముడు అనే బంధువులు సోమవారం రాత్రి వచ్చారు. వారికి రాత్రి భోజనాలు వండిపెట్టి పొరపాటున గ్యాస్ ఆఫ్ చేయకుండా నిద్రపోయారు.
ఏపీలోని నంద్యాల పరిధి చాపిరేవులలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. 9 మందికి గాయాలయ్యాయి. చాపిరేవులకు చెందిన వెంకటమ్మ (70) ఇంటికి బేతంచర్ల మండలం పెండేకల్లు గ్రామానికి చెందిన సుబ్బమ్మ, రాముడు అనే బంధువులు సోమవారం రాత్రి వచ్చారు. వారికి రాత్రి భోజనాలు వండిపెట్టి పొరపాటున గ్యాస్ ఆఫ్ చేయకుండా నిద్రపోయారు. అయితే ప్రమాదవశాత్తు గ్యాస్ కొద్దికొద్దిగా లీకైంది. మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచిన వెంకటమ్మ.. వంటగదిలో లైట్ వేసింది.
అప్పటికే గ్యాస్ లీకై ఉండటంతో సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. పేలుడు ధాటికి మిద్దె పైకప్పు కొంతభాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో వెంకటమ్మతో పాటు దినేశ్ (10)అనే బాలుడు మృతిచెందాడు. బంధువులు సుబ్బమ్మ, రాముడుతో పాటు రామలక్ష్మి, సుబ్బరాయుడు, కార్తీక్, వెంకటేశ్వరి, లింగమయ్య, సుధీర్, సుశాంత్‌కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నంద్యాలలో ఇంట్లో ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్