YSR Law Nestham: రెండోవిడత వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేసిన ఏపీ సీఎం జగన్, 2,807 యువ లాయర్ల అకౌంట్లలో రూ.7,98,95,000 జమ
రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరునెలలకు ఒక్కొక్కరికి రూ.30 వేల వంతున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమచేశారు.
2023–24 సంవత్సరానికి సంబంధించి రెండోవిడత వైఎస్సార్ లా నేస్తం నిధులను తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం బటన్ నొక్కి విడుదల చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరునెలలకు ఒక్కొక్కరికి రూ.30 వేల వంతున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమచేశారు.
సీఎం జగన్ మాట్లాడుతూ, వైఎస్సార్ లా నేస్తం ద్వారా ఇప్పటివరకు 6069 మంది న్యాయవాదులకు మేలు జరిగిందన్నారు. నాలుగున్నరేళ్లలో రూ.49.51 కోట్లు అందించాం. రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. పేదవాడి తరపున న్యాయవాదులంతా ఔదార్యం చూపించాలి. కోవిడ్ సమయంలోనూ యువ లాయర్లకు ప్రభుత్వం అండగా నిలబడింది. నాలుగేళ్లుగా యువ లాయర్లకు అండగా ఉంటున్నాం. పేదలకు యువ లాయర్లు న్యాయం చేయాలి’’ అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)