Andhra Pradesh Floods: వరదలతో ప్రభావితమైన గోదావరి జిల్లాలకు రూ.12 కోట్ల అత్యవసర నిధులు, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
12 కోట్లు నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున.. పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు.. తూర్పుగోదావరి కోటి.. మొత్తం 12 కోట్లు నిధులు మంజూరు చేసింది.
తీవ్ర వర్షాలు, వరదలతో ప్రభావితమైన గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ. 12 కోట్లు నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున.. పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు.. తూర్పుగోదావరి కోటి.. మొత్తం 12 కోట్లు నిధులు మంజూరు చేసింది.
ఈ మేరకు రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ పేరిట జీవో విడుదలయ్యింది. అత్యవసర సహాయక కేంద్రాల ఏర్పాటుకు, ముంపు గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు, వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు అందించేందుకు.. అలాగే హెల్త్ క్యాంపు నిర్వాహణతో పాటు శానిటేషన్ కోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం తరపున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)