Vijayawada Floods: విజయవాడలో వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ, బాధితులకు ఆహారం అందించేందుకు ముందుకు వచ్చిన దివీస్, అక్షయపాత్ర సంస్థలు

విజయవాడలో వరద బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు ఏపీ ప్రభుత్వం హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వరద బాధితులకు నేడు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించారు. బుడమేరు ముంపునకు గురైన ప్రాంతాల్లో రెండు హెలికాప్టర్ల సాయంతో ఆహార ప్యాకెట్లను, మంచినీటి బాటిళ్లను జారవిడిచారు.

Andhra Pradesh-govt-supplies-food-by-helicopters-in-flood-hit-areas-in-vijayawada

విజయవాడలో వరద బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు ఏపీ ప్రభుత్వం హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వరద బాధితులకు నేడు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించారు. బుడమేరు ముంపునకు గురైన ప్రాంతాల్లో రెండు హెలికాప్టర్ల సాయంతో ఆహార ప్యాకెట్లను, మంచినీటి బాటిళ్లను జారవిడిచారు. ఇప్పటివరకు 3 టన్నులకు పైగా ఆహారం, నీరు అందజేశారు. వరద బాధితులకు బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు అందిస్తున్నారు. వాటితోపాటే ఫ్రూట్ జ్యూస్ (టెట్రా ప్యాక్ లు), ఇతర ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు.మరో మూడు హెలికాప్టర్లు వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతాం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు

కాగా, విజయవాడ వరద బాధితులకు ఆహారం అందించేందుకు దివీస్, అక్షయపాత్ర ముందుకువచ్చాయి. దివీస్ సంస్థ రోజుకు 1.70 లక్షల మందికి ఆహారం అందిస్తోంది. ఆహార పంపిణీ కోసం రూ.2.5 కోట్లు ఖర్చు చేస్తున్నామని దివీస్ ఎండీ మురళీకృష్ణ తెలిపారు. ఐదు రోజుల పాటు ఆహారం అందిస్తామని వెల్లడించారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement