Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖ వ్యాలీ జువైనల్ హోమ్‌లో స్లీపింగ్ ట్యాబ్లెట్లు, మత్తు మందు ఇచ్చి బాలికలపై దారుణం, విచారణకు ఆదేశించిన హోం మంత్రి అనిత
సిబ్బంది తమను వేధిస్తున్నారంటూ విశాఖపట్నం వ్యాలీ వద్ద ఉన్న జువైనల్ హోమ్ బాలికలు బుధవారం ఆందోళనకు దిగారు. జువైనల్ హోమ్ ప్రహరీ గోడపైకెక్కి నిరసన తెలిపారు. తమకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇస్తూ మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
సిబ్బంది తమను వేధిస్తున్నారంటూ విశాఖపట్నం వ్యాలీ వద్ద ఉన్న జువైనల్ హోమ్ బాలికలు బుధవారం ఆందోళనకు దిగారు. జువైనల్ హోమ్ ప్రహరీ గోడపైకెక్కి నిరసన తెలిపారు. తమకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇస్తూ మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ నేఫథ్యంలోనే ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు బాలికలు.ఈ ఘటనపై స్పందించిన పొలీసులు.. ఆందోళనకు దిగిన బాలికలను హోమ్ లోపలికి పంపించారు.
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, దంపతులు వెళుతున్న బైకును ఢీకొట్టిన లారీ, ఇద్దరు అక్కడికక్కడే మృతి
ఈ నేపథ్యంలో బాలికలు ఆందోళనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత స్పందించారు. ఆరోపణలపై విశాఖ సీపీ, కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మహిళా పోలీసు, తహసీల్దార్ నేతృత్వంలో బాలికలతో మాట్లాడాలని అనిత ఆదేశించారు. తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఆరోపణలు వాస్తవమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విశాఖ వ్యాలీ జువైనల్ హోమ్‌లో స్లీపింగ్ ట్యాబ్లెట్లు, మత్తు మందు ఇచ్చి బాలికలపై దారుణం
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)