Andhra Pradesh Horror: ఏపీలో మరో దారుణం, రెండో పెళ్ళి చేసుకుందని మహిళను చెట్టుకు కట్టేసి కర్రలతో, కోడి గుడ్లతో దాడిచేసిన సాటి మహిళలు, వీడియో ఇదిగో..

అన్నమయ్య జిల్లాలోని వీరబల్లి మండలం షికారిపాలెంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మరో పెళ్లి చేసుకుందన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి సాటి మహిళలే ఆమెను దారుణంగా హింసించారు.

Fellow women tied woman to a tree and attacked her with sticks and eggs for remarrying in Annamayya District Video Surfaces

అన్నమయ్య జిల్లాలోని వీరబల్లి మండలం షికారిపాలెంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మరో పెళ్లి చేసుకుందన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి సాటి మహిళలే ఆమెను దారుణంగా హింసించారు. ఇటీవల భర్త నుంచి విడిపోయిన బాధిత మహిళ మరో పెళ్లి చేసుకున్నట్టు తెలియడంతో జీర్ణించుకోలేకపోయిన గ్రామంలోని మహిళలు ఆమెను పట్టుకుని చెట్టుకు కట్టేశారు. ఆపై తప్పు చేసిందంటూ విచక్షణ రహితంగా ప్రవర్తించారు. కర్రలతో ఆమెను కొడుతూ, కోడిగుడ్లతో దాడిచేస్తూ ఆమెను నానా హింసకు గురిచేశారు.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని బాధితురాలిని రక్షించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమె నుంచి ఫిర్యాదు అందుకున్న అనంతరం చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  వీడియో ఇదిగో, చిన్న గొడవకే డ్రైవర్‌ని బస్సుతో తొక్కించి చంపిన మరో డ్రైవర్, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన యాక్సిడెంట్ వీడియో

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement