Andhra Pradesh: వీడియో ఇదిగో, జగన్ ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం, కొవ్వూరులో యువకుడు హల్ చల్
అసెంబ్లీ ఎన్నికల్లో వైఎసీపీకి అధిక ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణ గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీతో కొవ్వూరు గామన్ బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని.. పోలీసు అధికారులు వస్తే దూకేస్తానని హల్ చల్ చేశాడు
కొవ్వూరు - అసెంబ్లీ ఎన్నికల్లో వైఎసీపీకి అధిక ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణ గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీతో కొవ్వూరు గామన్ బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని.. పోలీసు అధికారులు వస్తే దూకేస్తానని హల్ చల్ చేశాడు. ఘటనపై సకాలంలో స్పందించిన పోలీసులు వారిని అడ్డుకొని నచ్చజెప్పారు. వీడియో ఇదిగో, ఐ ప్యాక్ వల్లే మాకు ఘోర పరాజయం, తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు సంచలన వ్యాఖ్యలు
జగన్ ఓడిపోవడంలో ఈవీఎంల ట్యాంపరింగ్ ఉందని ఈ వీడియో ద్వారా రాష్ట్రపతికి తెలియజేయాలని వైయస్సార్ అభిమాని రాజు ఆవేదన చెందారు. రాజమండ్రి గామన్ బ్రిడ్జిపై నుండి గోదావరిలో దూకి తన కుటుంబ మొత్తం ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశారు. ఇప్పటికిప్పుడు మళ్లీ ఎలక్షన్ జరపాలని ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ జరిగితే జగనన్నే అధిక మెజారిటీతో గెలుస్తాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కొవ్వూరు పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులను క్షేమంగా ఇంటికి చేర్చారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)