Maharashtra Farmer Meets CM Jagan: కాబోయే ప్రధాని జగన్, మహారాష్ట్ర రైతును ఆప్యాయంగా పలకరించిన ఏపీ ముఖ్యమంత్రి, 800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన అభిమాని
మహారాష్ట్ర రైతు సీఎం జగన్ పై అభిమానంతో మహారాష్ట్ర నుంచి సైకిల్ తొక్కుతూ తాడేపల్లికి చేరుకున్నారు. ఆ రైతు పేరు కాకా సాహెబ్ లక్ష్మణ్ కాక్డే. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాకు చెందినవాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నా, ఆయన విధానాలు అన్నా లక్ష్మణ్ కాక్డే ఎంతో అభిమానించేవాడు. దాంతో జగన్ ను ఎలాగైనా కలవాలని నిశ్చయించుకున్నాడు.

ఈ నెల 17న మహారాష్ట్రలోని తన స్వస్థలం నుంచి ఓ సైకిల్ పై బయల్దేరాడు. 800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి తాడేపల్లి చేరుకున్నాడు. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి మురిసిపోయాడు. కాక్డే గురించి తెలుసుకున్న సీఎం జగన్ ఆ రైతును ఆప్యాయంగా ఆహ్వానించారు. అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, రైతు కాక్డే జగన్ బొమ్మ ఉన్న టీషర్టు ధరించాడు. దానిపై కాబోయే ప్రధాని జగన్ అంటూ రాసి ఉంది.
Here's AP CMO Tweet