Andhra Pradesh:అచ్యుతాపురం సెజ్‌లో భారీ పేలుడు, బయటకు పరుగులు తీసిన కార్మికులు, ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

Bomb Blast (Representational Image)

ఏపీలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. లాలంకోడూరు సమీపంలోని జీఎఫ్‌ఎంఎస్‌ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో.. భయాందోళనకు గురైన కార్మికులు అక్కడ నుంచి పరుగులు తీశారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కర్మాగారంలో ఉన్న కార్మికులను బయటకు పంపించారు. ప్రమాదానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అగ్నిమాపక అధికారులు విచారణ ప్రారంభించారు. కంపెనీ ప్రతినిధుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)