Andhra Pradesh: ఏపీలో ఘోర అగ్ని ప్రమాదం, తునాతునకలైన ఇద్దరి శరీర భాగాలు, బాణసంచాను వాహనంలోకి లోడ్‌ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది అన్నవరం అనే వ్యక్తికి చెందిన బాణసంచా కర్మాగారంలో ఈ పేలుడు జరిగింది.

Blast |Image used for representative purpose. (Photo Credits: IANS)

ఏపీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది అన్నవరం అనే వ్యక్తికి చెందిన బాణసంచా కర్మాగారంలో ఈ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మరణించాడు. 80 శాతం గాయాలపాలైన మరొక వ్యక్తిని మెరుగైన చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. గ్రామంలోని రాజం చెరువు సమీపంలో ఉన్న ఈ కేంద్రంలో బాణసంచాను ఓ వాహనంలోకి లోడ్‌ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)