Free Bus Row in AP: వీడియో ఇదిగో, ఒక జిల్లా నుండి ఇంకో జిల్లా వెళ్ళడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మేము ఎక్కడా చెప్పలేదని తెలిపిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నట్టు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కచ్చితంగా ఉంటుందని, అయితే, ఒక జిల్లా వారు మరో జిల్లాలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు.

Andhra Pradesh Minister Gummadi Sandhya Rani on Key Comments on Free Bus Scheme for Women

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నట్టు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కచ్చితంగా ఉంటుందని, అయితే, ఒక జిల్లా వారు మరో జిల్లాలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ విషయంపై స్పష్టత నిస్తున్నట్టు పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై నిన్న శాసన మండలిలో చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సంధ్యారాణి ఇలా బదులిచ్చారు.

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అయితే జిల్లాల పరిధిలోనే ఫ్రీ బస్సు.. జిల్లా దాటితే ఛార్జీల మోతే.. కీలక ప్రకటన చేసిన మంత్రి సంధ్యారాణి

శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా వైసిపి సభ్యులు పివి సూర్యనారాయణ రాజు శాసనమండలిలో గురువారం ఈ అంశాన్ని లేవనెత్తారు. ఉచిత బస్సు పథకం ప్రవేశపెడితే అన్నవరం నుంచి తిరుపతి వెళ్లేందుకు మహిళ లు ఎదురుచూస్తున్నారని అన్నారు. మంత్రి సంధ్యారాణి జోక్యం చేసుకొని ఉచిత బస్సు జిల్లాలకే పరిమితమని సమాధానం చెప్పారు.

Minister Gummadi Sandhya Rani on Key Comments on Free Bus Scheme

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement