Andhra Pradesh Debts Row: ఏపీ అప్పులపై పార్లమెంట్ సాక్షిగా క్లియర్ కటౌట్ ఇదిగో, నాలుగేళ్లలో జగన్ సర్కారు చేసిన అప్పులు రూ.1,77,991కోట్లు మాత్రమే
ఏపీ అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడే ఉన్నాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికపరిస్థితి ఎఫ్‌ఆర్‌బీఎంకు అనుగుణంగానే ఉందని తేల్చిచెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు బయటపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్. ఏపీ అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడే ఉన్నాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికపరిస్థితి ఎఫ్‌ఆర్‌బీఎంకు అనుగుణంగానే ఉందని తేల్చిచెప్పారు. ఈరోజు(సోమవారం) ఏపీ అప్పులపై లోక్‌సభలో ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ తేల్చి అసలు విషయం చెప్పారు. ‘ఏపీ అసెంబ్లీ ఎఫ్‌ఆర్‌బీఎంను పర్యవేక్షిస్తుంది. ఫైనాన్స్ కమిషన్ సిఫారుసులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయి. 2019 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ. 2,64,451 కోట్లు. 2023 నాటికి ఏపీ అప్పులు రూ. 4,42, 442 కోట్లకు చేరాయి. నాలుగేళ్లలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 1,77,991కోట్లు’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)