Yuvagalam Padayatra: పొదలాడ నుంచి ప్రారంభమైన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర, రోజుకు 15 కి.మీ నుంచి 20 కి.మీ నడిచేలా ప్రణాళిక

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. చంద్రబాబు అరెస్ట్‌తో తాత్కాలికంగా నిలిచిన పాదయాత్ర.. 79 రోజుల విరామం అనంతరం సోమవారం తిరిగి మొదలైంది. ఉదయం 10.19 గంటలకు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి లోకేశ్‌ తన పాదయాత్రను ప్రారంభించారు.

Nara Lokesh resumes Yuvagalam Padayatra from Podalada

సెప్టెంబరు 8న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర రాజోలు మీదుగా పొదలాడ చేరుకుంది. ఆ మరుసటి చంద్రబాబు అరెస్టు కావడంతో లోకేశ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. చంద్రబాబుకు ఇటీవల బెయిల్‌ మంజూరు కావడంతో యాత్రను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. గతంలో నిర్దేశించిన మార్గంలో కాకుండా.. ఈ సారి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రోజుకు 15 కి.మీ. నుంచి 20 కి.మీ. మేర పాదయాత్ర, మధ్యలో బహిరంగ సభలు, స్థానికులతో ముఖాముఖి నిర్వహిస్తూ ముందుకు సాగనున్నారు.

Nara Lokesh resumes Yuvagalam Padayatra from Podalada

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now