MP Raghu Ramakrishnam Raju: సీఎం జగన్ నుంచి నాకు ప్రాణ హాని, పార్లమెంటు సభ్యులకు లేఖ రాసిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ, లేఖలో ఏపీ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు గురువారం ఆయన తనకు పొంచి ఉన్న ముప్పును వివరిస్తూ తన సహచర పార్లమెంటు సభ్యులకు లేఖ రాశారు. 4 పేజీల లేఖలో వైసీపీ నేతలపైనా, ప్రత్యేకించి సీఎం జగన్‌పై ఆయన ఆరోపణలు గుప్పించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు గురువారం ఆయన తనకు పొంచి ఉన్న ముప్పును వివరిస్తూ తన సహచర పార్లమెంటు సభ్యులకు లేఖ రాశారు. 4 పేజీల లేఖలో వైసీపీ నేతలపైనా, ప్రత్యేకించి సీఎం జగన్‌పై ఆయన ఆరోపణలు గుప్పించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పైనే నరసాపురం లోక్ సభ స్థానం నుంచి రఘురామరాజు ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.
జగన్ సర్కారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను విమర్శించిన నేపథ్యంలో పార్టీతో ఆయనకు దూరం పెరిగింది. ఈ క్రమంలో ఓ దఫా ఏపీ సీఐడీ అధికారులు తనను అరెస్ట్ చేయగా...కస్టడీలోనే పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ ఆరోపించారు. ఈ వ్యవహారంపైనా ఆయన సహచర ఎంపీలకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే తాజాగా జగన్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ మరోమారు ఎంపీలకు రఘురామరాజు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)