Dr. Sudhakar Dies: గుండెపోటుతో కన్నుమూసిన వివాదాస్పద అనస్థీషియా వైద్యుడు కె.సుధాకర్‌, డాక్టర్ సుధాకర్ మృతి పట్ల చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్

గురువారం అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కింగ్‌ జార్జి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి (Anesthesiologist doctor Sudhakar) చెందారు.

cbi-files-case-against-dr-sudhakar-for-violating-lockdown (Photo-Video grab)

గతేడాది నర్సీపట్నం ప్రభుత్వ వైద్యశాలలో మాస్కులు పంపిణీ చేయడం లేదంటూ దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై విమర్శలు చేసి సస్పెండయ్యారు. ఆ తర్వాత రోడ్డుపై మద్యం మత్తులో నానా యాగీ చేసి పీఎంను, సీఎంను తీవ్రంగా దూషించారు. డాక్టర్ సుధాకర్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడునారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబ సభ్యులకు కోటి రూపాయలు పరిహారం ఇచ్చి, అన్ని విధాల ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. సుధాకర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Here's Dr. Sudhakar Dies News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)