Anantapur Horror: అనంతపురం ప్రిన్సిపల్ మర్డర్ వీడియో బయటకు, మేనల్లుడి చేతిలో దారుణ హత్యకు గురైన మామ రక్తపు మడుగులో.. ఘోరాన్ని చూసిన భార్య గుండెపోటుతో మృతి
అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వ్యక్తిగత కక్షతో సొంత మేనమామను గొంతుకోసి హత్య చేశాడు ఓ మేనల్లుడు.భర్త మరణ వార్త విన్న వెంటనే దాన్ని తట్టుకోలేక ఆయన భార్య శోభ కూడా గుండెపోటుతో మృతి చెందింది.
అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వ్యక్తిగత కక్షతో సొంత మేనమామను గొంతుకోసి హత్య చేశాడు ఓ మేనల్లుడు.భర్త మరణ వార్త విన్న వెంటనే దాన్ని తట్టుకోలేక ఆయన భార్య శోభ కూడా గుండెపోటుతో మృతి చెందింది. ప్రిన్సిపాల్ మూర్తిరావును హతమార్చిన అనంతరం మేనల్లుడు ఆదిత్య ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్‌కు వెళ్లి చేతికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని, మృతదేహం పక్కనే కూర్చుండి పోయాడు.
ఇంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. తమ కుటుంబాన్ని ఎదగనీయకుండా మామ చూస్తున్నారని, తనకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుకుంటున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌లైన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. నిందితుడిని సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. అనంతపురంలో మేనల్లుడి చేతిలో మామ దారుణ హత్య, భర్త మరణవార్త విన్న తర్వాత గుండెపోటుతో భార్య మృతి
Here's Disturbed Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)