Andhra Pradesh: సీఎం జగన్‌తో భేటీ అయిన పలు వర్సిటీల కొత్త వీసీలు, వేదికగా మారిన క్యాంపు కార్యాలయం

ఏపీలో పలు యూనివర్సిటీలకు కొత్తగా నియమితులైన వైస్‌ ఛాన్స్‌లర్లు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. కాగా, వీసీలుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. వీరంతా సీఎం జగన్‌ను కలిశారు.

YS Jagan Mohan Reddy (Photo-Twitter)

ఏపీలో పలు యూనివర్సిటీలకు కొత్తగా నియమితులైన వైస్‌ ఛాన్స్‌లర్లు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. కాగా, వీసీలుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. వీరంతా సీఎం జగన్‌ను కలిశారు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన వారిలో కడప డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ వీసీగా నియమితులైన బానోత్‌ ఆంజనేయ ప్రసాద్‌, జవహర్‌లాల్‌ నెహ్రు టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(జేఎన్‌టీయూ) గురజాడ, విజయనగరం వీసీ కే. వెంకట సుబ్బయ్య, ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఒంగోలు వీసీ మారెడ్డి అంజిరెడ్డి ఉన్నారు. ఇక, ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఫ్రొ. కే. హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Here;s CMO Tweet

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement