Andhra Pradesh: వైఎస్ఆర్ పెన్షన్ కానుక నుండి ఎన్టీఆర్ భరోసాగా మారిన ఏపీ పెన్సన్ స్కీం పేరు, వచ్చే నెల నుంచి అర్హులైన వారికి రూ. 4 వేలు పెన్సన్
దీంతో పాటు ఆ పథకం పేరును మారుస్తూ జీవో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ పెన్షన్ స్కీమ్ పేరు వైఎస్ఆర్ పెన్షన్ కానుక నుండి ఎన్టీఆర్ భరోసాగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్నికల హామీలో భాగంగా సామాజిక భద్రత పెన్షన్ల పెంపును ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే పెన్సన్ల పెంపును ప్రకటించారు. దీంతో పాటు ఆ పథకం పేరును మారుస్తూ జీవో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ పెన్షన్ స్కీమ్ పేరు వైఎస్ఆర్ పెన్షన్ కానుక నుండి ఎన్టీఆర్ భరోసాగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ ఐవీ బాధితులు, కళాకారులకు ప్రతీనెల రూ.3వేలు పింఛన్ అందుతుంది. పింఛన్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. రూ.3 వేల పింఛన్ ను ఒకేసారి రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం
సీఎంగా చంద్రబాబు ఆ పింఛన్ ను రూ.4వేలకు పెంచుతూ దస్త్రంపై గురువారం సంతకం చేశారు. దీంతో ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేయనుండటంతో జులై 1న పింఛన్ కింద వీరికి రూ. 7వేలు (జులై1న ఇచ్చే రూ.4వేలు, ఏప్రిల్ నుంచి మూడు నెలలకు రూ వెయ్యి చొప్పున) అందివ్వనున్నారు. అలాగే.. దివ్యాంగులకు ప్రస్తుతం రూ.3వేలు అందుతుంది.. జులై నెల నుంచి వారికి రూ. 6వేలు అందివ్వనున్నారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)