Andhra Pradesh Politics: విజయవాడలో టీడీపీకీ మరో షాక్, కార్పొరేటర్ పదవికి, టీడీపీకి గుడ్‌బై చెప్పిన కేశినేని శ్వేత
టీడీపీకి కేశినేని శ్వేత రాజీనామా చేశారు. తన కార్పొరేటర్ పదవికి, టీడీపీకి ఆమె గుడ్‌బై చెప్పారు. తాజాగా విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మికి కేశినేని శ్వేత తన రాజీనామా లేఖను అందించారు. ఈ సందర్భంగా తన కార్పొరేటర్ సభ్యత్వం రాజీనామా లేఖను కౌన్సిల్లో పెట్టి ఆమోదించాలని మేయర్‌ను శ్వేత కోరారు.
విజయవాడలో టీడీపీకీ మరో షాక్ తగిలింది. టీడీపీకి కేశినేని శ్వేత రాజీనామా చేశారు. తన కార్పొరేటర్ పదవికి, టీడీపీకి ఆమె గుడ్‌బై చెప్పారు. తాజాగా విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మికి కేశినేని శ్వేత తన రాజీనామా లేఖను అందించారు. ఈ సందర్భంగా తన కార్పొరేటర్ సభ్యత్వం రాజీనామా లేఖను కౌన్సిల్లో పెట్టి ఆమోదించాలని మేయర్‌ను శ్వేత కోరారు.
ఈ సందర్బంగా కేశినేని శ్వేత మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ పదకొండవ డివిజన్ కార్పొరేటర్‌గా నేను రాజీనామా చేశాను. రాజీనామా ఆమోదం పొందాక నేను కూడా టీడీపీకి రాజీనామా చేస్తాను. మేము ఎప్పుడూ టీడీపీని వీడాలని అనుకోలేదు. టీడీపీ మమ్మల్ని వద్దు అనుకున్నప్పుడు మేము పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు. పార్టీకి తర్వాత కేశినేని నాని కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తారు. గౌరవం లేని చోట మేము పనిచేయలేము. కేశినేని నాని, నేను ప్రజల తరుపున పోరాటం చేస్తామని తెలిపారు. అంతకుముందు కేశినేని శ్వేత, టీడీపీకి రాజీనామా చేయబోతున్నట్టు ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా చెప్పిన విషయం తెలిసిందే.
Here's Nani Tweet
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)