Somu Veerraju: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు, ఏపీలో అయిదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే, నేడు నామినేషన్‌కు చివరి రోజు
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ (BJP) ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు(Somu Veerraju)ను ఎంఎల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. నేడు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమిలో టీడీపీకు 3, జనసేన, బీజేపీలకు ఒక్కొక్కటి చొప్పున సీట్ల సర్దుబాటు జరిగింది.

టీడీపీ నుంచి అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలను పార్టీ ఆదివారం ప్రకటించింది. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు చెరో స్థానాన్ని కేటాయించింది. జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజును ఆ పార్టీ ఖరారు చేసింది. నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు కావడంతో అభ్యర్థులు ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీయే కూటమి అన్ని స్థానాలూ గెలుచుకునే అవకాశముంది.
Somu Veerraju confirmed as BJP MLC Candidate Under MLA Quota MLC Seat
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)