Andhra Pradesh: వీడియో ఇదిగో, జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించిన కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, నిరసనకు దిగిన కూటమి శ్రేణులు
అయితే, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వచ్చారని తెలుసుకున్న కూటమి కార్యకర్తలు ఆయన కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ధర్మవరం సబ్‌జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి పరామర్శించారు. అయితే, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వచ్చారని తెలుసుకున్న కూటమి కార్యకర్తలు ఆయన కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అడ్డొచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. కేతిరెడ్డి వాహనాన్ని అడ్డగించి, పైకి ఎక్కిన టీడీపీ కార్యకర్త. టీడీపీ కార్యకర్త వాహనంపై ఉండగానే ముందుకు పోనిచ్చిన డ్రైవర్. కార్యకర్త కింద పడిపోవడంతో నెలకొన్న ఉద్రిక్తత. సబ్ జైల్ నుంచి కేతిరెడ్డిని వాహనంలోకి డీఎస్పీ శ్రీనివాసులు, పోలీసుల సిబ్బంది తరలించారు.
ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పంచుకున్నారు. ఇదీ ధర్మవరం కేటురెడ్డి నిజస్వరూపం అంటూ ట్వీట్ చేశారు. ఓటమితో మైండ్ బ్లాంక్ అయ్యి, ప్రజలపైకి తన వాహనాన్ని నడిపి గుద్దుకుంటూ వెళ్లిపోయిన వైనం అని వివరించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)