Rakshana Nidhi Slams Jagan: వీడియో ఇదిగో, జగన్‌..నీవల్లే వైసీపీ ఘోరంగా ఓడిపోయింది, అధినేతపై విరుచుకుపడిన తిరువూరు వైసీపీ మాజీ ఎమ్యెల్యే రక్షణ నిధి

మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ దారుణ పరాజయం పాలవ్వడంతో నేతలంతా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా తిరువూరు వైసీపీ మాజీ ఎమ్యెల్యే రక్షణ నిధి జగన్ మీద ఫైర్ అయ్యారు. జగన్ నీవల్లే వైస్సార్సీపీ ఓడిపోయింది, జగన్ ప్రజలకు చేసిందేమీ లేదు..

Andhra Pradesh Politics: Tiruvuru YSRCP leader Rakshana Nidhi Slammed party chief YS Jagan Mohan Reddy Watch Video

మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ దారుణ పరాజయం పాలవ్వడంతో నేతలంతా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా తిరువూరు వైసీపీ మాజీ ఎమ్యెల్యే రక్షణ నిధి జగన్ మీద ఫైర్ అయ్యారు. జగన్ నీవల్లే వైస్సార్సీపీ ఓడిపోయింది, జగన్ ప్రజలకు చేసిందేమీ లేదు.. బటన్ నొక్కుడు తప్ప నువ్వు రాష్టానికి చేసింది శూన్యం.. జగన్ వల్లే తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయా.. ఇళ్లు కట్టిస్తానని చెప్పావ్. రోడ్ల అభివృద్ధికి పది కోట్లు అడిగా అది ఇవ్వలేదు, అసలు నువ్వు ఎవ్వరిని లెక్క చెయ్యలేదు. పార్టీ కార్యకర్తలని, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని గుర్తించలేదు. ఎమ్యెల్యేలని లైట్ తీసుకున్నావని మండిపడ్డారు.  వీడియో ఇదిగో, జగన్ ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం, కొవ్వూరులో యువకుడు హల్ చల్

మరోపక్క చంద్రబాబు, పవన్ పార్టీలని ఎంత చక్కగా గెలిపించుకున్నారో.. ఒక ఎంపీకి ఫ్లైట్ టికెట్ లేదు అంటే.. పిలిచి మరీ అడిగారు చంద్రబాబు. కానీ నువ్వెప్పుడూ వైసీపీ ఎమ్యెల్యేలతో, మంత్రులతో మాట్లాడిన పాపాన లేదు. నీకు అంత సమయం లేదా.. అదే నేను అడుగుతున్నాను. నీవల్లే వైసీపీ ఓడిపోయింది అంటూ విమర్శలు గుప్పించారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement