Andhra Pradesh Politics: కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతాం, ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ సంచలన వ్యాఖ్యలు
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడు.
గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి చార్జిషీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ యూజ్ లెస్ గవర్నమెంట్ నడుపుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడు. ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతుంది.జగన్ సహా ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ దొంగలే. జగన్ మంత్రిమండలి అలీబాబా 40 దొంగలు లాగా తయారయ్యారు.
సాధారణంగా రోడ్ల మీద గుంతలు ఉంటాయి, ఏపీలో మాత్రం గుంతల మీద రోడ్లు ఉన్నాయి. ఏపీ కంటే యూపీ, అస్సాం రోడ్లు బావున్నాయి. ఏపీలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, గంజాయి మాఫియా నడుస్తుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా, చివరికి బంగ్లాదేశ్ లో గంజాయి దొరికినా అది ఏపీ నుండే సప్లై అవుతుంది.
Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)