Gannavaram Politics: టీడీపీ తీర్థం పుచ్చుకున్న యార్లగడ్డ వెంకట్రావు, గన్నవరంలో ఒక్కసారిగా మారిపోయిన రాజకీయాలు
ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావు నారా లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గన్నవరం నియోజకవర్గం నిడమానూరు క్యాంప్ సైట్ లో లోకేశ్ పసుపు కండువా కప్పి యార్లగడ్డను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావు నారా లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గన్నవరం నియోజకవర్గం నిడమానూరు క్యాంప్ సైట్ లో లోకేశ్ పసుపు కండువా కప్పి యార్లగడ్డను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, పంచుమర్తి అనురాధ, వంగవీటి రాధా తదితరులు పాల్గొన్నారు. టీడీపీలో చేరిన యార్లగడ్డకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు.
గత ఎన్నికల్లో గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పుడాయన వైసీపీ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనపై గెలిచింది టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ. ఇప్పుడదే వంశీ వైసీపీకి దగ్గర కాగా, యార్లగడ్డ తెలుగుదేశం పక్షాన చేరారు. ఈసారి ఎన్నికల్లోనూ యార్లగడ్డ, వంశీ మధ్య పోరు ఉండే అవకాశాలున్నాయి. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన యార్లగడ్డ... చంద్రబాబు చెబితే ఎక్కడ్నించైనా పోటీకి సిద్ధం అంటూ సమర సన్నద్ధతను చాటారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)