One Nation One Election: జమిలి బిల్లు కోసం జేపీసీలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మొత్తం 31 మందితో కూడిన జేపీసీ జాబితా ఇదిగో..
ఈ కమిటీలో తాజాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. ఈ జేపీసీ కమిటీలో రాజ్యసభ నుంచి 12మందికి చోటు కల్పించింది.
జమిలి బిల్లు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తాజాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. ఈ జేపీసీ కమిటీలో రాజ్యసభ నుంచి 12మందికి చోటు కల్పించింది. ఆ 12మందిలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది.. మొత్తం 31 మందితో కూడిన జేపీసీ జాబితాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పీపీ చౌధరిని ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించారు.
కమిటీలో అనురాగ్ ఠాకూర్, అనిల్ బలూనీ, సంబిత్ పాత్రా, శ్రీకాంత్ ఏక్‌నాథ్‌షిండే, సుప్రియా సూలే, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, సెల్వ గణపతి తదితరులకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (రాజ్యసభ నుంచి), బాలశౌరి(జనసేన), హరీష్ బాలయోగి(టీడీపీ), సీఎం రమేష్(రాజ్యసభ నుంచి)లకు జేపీసీలకు అవకాశం ఇచ్చారు.
YSRCP MP Vijayasai Reddy Name in JPC
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)