Vijayasai Reddy on TDP: రెడ్‌బుక్ పేరుతో ఎంత కాలం ఈ రావణ దహనం? వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపాటు, పోలీస్ యంత్రాంగం కూడా బెంబేలెత్తిపోతోందంటూ..

‘‘టీడీపీ వాళ్లు నడిరోడ్డు మీద పట్టపగలే వైఎస్సార్‌సీపీ వారిని హతమారుస్తుంటే, వాటిని గురించి మాట్లాడకుండా.. హంతకులు కూడా వైఎస్సార్‌సీపీ వాళ్లే అని అబద్ధాలతో ఎదురు దాడి చేస్తున్నారు.

Vijaysai Reddy vs Nara Lokesh (photo-X)

ఏపీలో దాడులపై ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘టీడీపీ వాళ్లు నడిరోడ్డు మీద పట్టపగలే వైఎస్సార్‌సీపీ వారిని హతమారుస్తుంటే, వాటిని గురించి మాట్లాడకుండా.. హంతకులు కూడా వైఎస్సార్‌సీపీ వాళ్లే అని అబద్ధాలతో ఎదురు దాడి చేస్తున్నారు. ఏ పార్టీ వాళ్ళైనా హత్యల్ని ఎలా సమర్దిస్తారు? రెడ్‌బుక్ పేరుతో ఎంత కాలం ఈ రావణ దహనం?’’ అంటూ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. ‘‘అంతు చూస్తా, పాదాలతో తొక్కేస్తా అంటే రాజకీయ కక్ష అనుకున్నాము.. నిజంగానే ప్రభుత్వం ఇంతటీ హింసకు దిగజారుతుందని అనుకోలేదు, హోం మంత్రి తుపాకి పట్టుకోవాలంటోంది.. ప్రజలే కాదు.. పోలీస్ యంత్రాంగం కూడా బెంబేలెత్తిపోతోంది టీడీపీ హత్యారాజకీయాలతో’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.  వివేకా హత్య కేసుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, రేపటి నుంచి మరో 3 శ్వేతపత్రాలు అసెంబ్లీలో పెడతామని స్పష్టం

Here's YSRCP MP Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif