Andhra Pradesh: విశాఖ మన్యంలో దారుణ పరిస్థితులు, గర్భిణీని డోలీలో 3 కిలోమీట్లరు మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకువెళ్లిన బంధువులు, ఆరోగ్య పరిస్థితి విషమించి పురిట్లోనే బిడ్డ మృతి
విశాఖ మన్యంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో గర్భిణీని డోలీలో మోసుకెళ్లారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని పెదగరువు కొండ శిఖర గ్రామానికి చెందిన కమల అనే మహిళకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. అయితే.. ఆ గ్రామంలో ఆస్పత్రి లేదు.
విశాఖ మన్యంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో గర్భిణీని డోలీలో మోసుకెళ్లారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని పెదగరువు కొండ శిఖర గ్రామానికి చెందిన కమల అనే మహిళకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. అయితే.. ఆ గ్రామంలో ఆస్పత్రి లేదు. బుచ్చింపేట పీహెచ్సీ కి తరలించారు.విషయం తెలుసుకున్న గ్రామస్థులు, మహిళ బంధువులు.. ఆమెను చికిత్స కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు.
అయితే గ్రామం నుంచి బయటకు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో చేసేదేమీ లేక.. నిండు గర్భిణీని డోలిపై మోసుకెళ్లారు. కొండలు, గుట్టలు దాటుకుంటూ మూడు కిలోమీటర్లు డోలిపై తీసుకెళ్లారు. అర్ల వరకు మోసుకెళ్లి.. ఆ తర్వాత బుచ్చింపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు 108 వాహనంలో తరలించారు. మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్య పరిస్థితి విషమించి.. మృతి చెందింది. దీంతో బాధిత తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.నిన్న హుకుంపేటలో గర్బిణీని ఆసుపత్రికి తెచ్చేలోపు డోలీలోనే డెలివరీ-అయి బిడ్డ చనిపోయారు. తాజాగా ఈ ఘటనతో అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో చాటి చెబుతున్నాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)