Vijayawada Floods: వీడియో ఇదిగో, విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్, కృష్ణలంక వాసుల్ని కలిసిన మాజీ సీఎం, బాధితులకు అండగా ఉండాలని వైసీపీ శ్రేణులకు పిలుపు
విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని వైఎస్ జగన్‌కు కృష్ణలంక వాసులు కృతజ్ఞతలు తెలిపారు
భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృత రూపం దాల్చడంతో విజయవాడ నగరం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.రహదారులు.. వాగులు, వంకలుగా మారాయి. భారీ నుంచి అతి వర్షాలకు కొండవీటి వాగు ఉప్పొంగింది. అదే సమయంలో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. అనేక లంక గ్రామాలు నీట మునిగాయి. విజయవాడలో వరద బాధిత ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు పర్యటిస్తున్నారు. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతాం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు
ఈ మేరకు ఇప్పటికే పులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు వైఎస్ జగన్. విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని వైఎస్ జగన్‌కు కృష్ణలంక వాసులు కృతజ్ఞతలు తెలిపారు.వైఎస్సార్‌సీపీ శ్రేణులు సహాయ చర్యల్లో అండగా ఉంటారని బాధితులకు భరోసానిచ్చారు.
Here's Video