Andhra Pradesh Rains: భారీ వర్షాలకు విశాఖలో ఇళ్లలోకి చేరిన వరద నీరు, పూర్తిగా నీట మునిగిన జ్ఞానాపురం, వీడియోలు ఇవిగో..
ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువ అవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది.
భారీ వర్షాలతో విశాఖ నగరంలో పూర్తిగా నీట మునిగిన జ్ఞానాపురం. ఇళ్లలోకి చేరిన వరద నీరు, ఓజోన్ వ్యాలీలోని యానిమల్ రెస్క్యూ సెంటర్లో వర్షానికి అల్లాడుతున్న మూగజీవాలు. కుండపోత వర్షానికి జలమయమైన వైజాగ్ రోడ్లు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర పీడనంగా మారగా మరికాసేపట్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణశాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువ అవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది.
Here's Videos