Vijayawada Rains: వీడియో ఇదిగో, మంచినీళ్లు లేవు, ఆహారం లేదు, కాపాడాలంటూ వీడియో ద్వారా వేడుకున్న విజయవాడ వైఎస్ఆర్ కాలనీవాసులు
వాగులు, వంకలుగా మారాయి. భారీ నుంచి అతి వర్షాలకు కొండవీటి వాగు ఉప్పొంగింది.
భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృత రూపం దాల్చడంతో విజయవాడ నగరం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.రహదారులు.. వాగులు, వంకలుగా మారాయి. భారీ నుంచి అతి వర్షాలకు కొండవీటి వాగు ఉప్పొంగింది. అదే సమయంలో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది.కృష్ణా నదిలో భారీగా వస్తున్న వరద నీరు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం సంపులో చేరడం.. వాగుకు పైనుంచి వచ్చే వరద నీరు సంపు వరకు రాకపోవడంతో గంటగంటకు కొండవీటి నీటిమట్టం పెరుగుతోంది. నిన్న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లి గుహల వద్ద కొండవీటి వాగు 8 అడుగుల ఎత్తులో ప్రవహిస్తుండగా.. రాత్రికి 11 అడుగులకు చేరింది.మంచినీళ్లు లేవు.. ఆహారం లేదు... చాలామంది రోగులున్నారు.. ప్రభుత్వం వెంటనే స్పందించాలని విజయవాడ వైఎస్ఆర్ కాలనీవాసుల ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి వీడియో ద్వారా తెలియజేశారు. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతాం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)