Andhra Pradesh Rains: గుంటూరు జిల్లాలో భారీ వర్షం, తడిసి ముద్దయిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బహిరంగ సభ వేదిక, వీడియో ఇదిగో..

ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. ఈ రోజు ఉదయం నుంచి ఎండ దంచికొట్టి ఒక్కసారిగా మారిన వాతావరణంతో.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా గుంటూరు సిటీ, తాడికొండ, ప్రత్తిపాడు, మేడికోండూరులోని పలు ప్రాంతాల్లో గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది.

Rains (photo-File Image)

ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. ఈ రోజు ఉదయం నుంచి ఎండ దంచికొట్టి ఒక్కసారిగా మారిన వాతావరణంతో.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా గుంటూరు సిటీ, తాడికొండ, ప్రత్తిపాడు, మేడికోండూరులోని పలు ప్రాంతాల్లో గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది. ఈ రోజు వైసీపీ పార్టీ తరఫున సీఎం జగన్ సిద్ధం సభ ఏటుకూరు వద్ద జరగనుంది. కాగా అక్కడ కూడా భారీ వర్షం కురవడంతో సిద్ధం సభ నిర్వహణపై నీలినీడలు అలముకున్నాయి. అలాగే వర్షం సమయంలో భారీగా విచిన ఈదురు గాలుల వల్ల సభ కోసం ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, ప్లెక్సీలు సైతం నేలమట్టం అయ్యాయి.  శాంతిస్తున్న సూర్యుడు, తమిళనాడులో 13 జిల్లాల్లో భారీ వర్షాలు, మరో 48 గంటలపాటు రాష్ట్రంలో వానలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement